ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి: రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డిమాండ్

by Kodari Anjali |

ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని ,అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వి.జి.బి–రాంజీ జీ పథకాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు.

ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి: రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డిమాండ్
X

దిశ, వీపనగండ్ల: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలను విరమించి, గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వి.జి.బి–రాంజీ జీ పథకాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సీఐటీయూ కేంద్ర కమిటీల పిలుపు మేరకు బుధవారం మండలంలోని వీపనగండ్ల, గోపాల్ దీన్నే, గోవర్ధనగిరి, పుల్గర్ చర్ల, సంగి నేనిపల్లి క గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఉపాధి కూలీలతో కలిసి ధర్నా నిర్వహించారు. పై గ్రామాల సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి బాల్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ పేదల జీవనాధారమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఏడాదికి 200 రోజుల ఉపాధిన కల్పించాలని, పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, కూలీల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల్లో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులు, ఉపాధి కూలీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story