ఎస్‌ఓ–వంట సిబ్బంది వివాదంపై భిన్న కథనాలు..

by Taduka Kalyani |

ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో బుధవారం ఉదయం వంట కార్యక్రమం ఆలస్యమవడం తో సుమారు 300 మంది విద్యార్థినులకు అందాల్సిన అల్పాహారం నిర్ణీత సమయానికి అందలేదు.

ఎస్‌ఓ–వంట సిబ్బంది వివాదంపై భిన్న కథనాలు..
X

దిశ, బోనకల్ : ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో బుధవారం ఉదయం వంట కార్యక్రమం ఆలస్యమవడం తో సుమారు 300 మంది విద్యార్థినులకు అందాల్సిన అల్పాహారం నిర్ణీత సమయానికి అందలేదు. దీంతో విద్యార్థినులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పాఠశాలలో ప్రస్తుతం 370 మంది విద్యార్థినులు నమోదు కాగా, బుధవారం సుమారు 300 మంది హాజరైనట్లు సమాచారం. వీరి కోసం ఇద్దరు వంట మాస్టర్లు, ముగ్గురు హెల్పర్లు విధులు నిర్వహించాల్సి ఉండగా, ఒకరు మెడికల్ లీవ్‌లో ఉండగా, మిగిలిన నలుగురు సిబ్బంది ఆరోగ్య సమస్యల కారణంగా విధులకు దూరంగా ఉన్నట్లు తెలిసింది.గత విద్యా సంవత్సరంలో 270 మంది విద్యార్థులకు వంట చేయడానికే ఐదుగురు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెరగడంతో అందుబాటులో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడినట్లు సమాచారం. సాధారణంగా ఉదయం 8 గంటలకు అందించాల్సిన అల్పాహారం బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో విద్యార్థినులకు అందించినట్లు తెలిసింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలోని ఉపాధ్యాయులు, పీఈటీ, వాచ్‌మన్, స్వీపర్ సహకారంతో పాటు చింతకాని నుంచి హెడ్ కుక్‌ను రప్పించి వంట కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సమాచారం. అనంతరం విద్యార్థినులకు అల్పాహారం అందించారు.

ఎస్‌ఓ సక్కుబాయి వివరణ

ఈ ఘటనపై ఎస్ ఓ సక్కుబాయి స్పందిస్తూ వంట సిబ్బందితో తనకు ఎటువంటి వివాదాలు లేవని స్పష్టం చేశారు. ఒకే రోజు నలుగురు సిబ్బంది ఆరోగ్యం బాగాలేదని పర్మిషన్ లేఖల ద్వారా తెలియజేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒకరు మాత్రమే మెడికల్ లీవ్‌లో ఉండగా, మిగిలిన వారు అనారోగ్య కారణాలతో సెలవు కోరినట్లు తెలిపారు.

వంట సిబ్బంది వివరణ

సిబ్బందిని వివరణ కోరగా తమకు వాంతులు, విరేచనాలు, జ్వరం, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వారు తెలియజేశారని ఎస్‌ఓ చెప్పారు. విద్యార్థినుల భోజన ఏర్పాట్లలో ఎలాంటి అంతరాయం కలగకుండా వాచ్‌మన్, స్వీపర్, పీఈటీ, ఉపాధ్యాయులు, చింతకాని నుంచి రప్పించిన హెడ్ కుక్ సహకారంతో వంట కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు. విద్యార్థినుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఓ తెలిపారు.

Next Story