- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెనిజులాలో మరోసారి భయానక వాతావరణం.. రక్తంలా మారిన ఆకాశం
ఇటీవల భూకంపాలతో అల్లాడిపోయిన వెనిజులాలో మరోసారి భయానక వాతావరణం ఏర్పడింది. వెనిజులా రాజధాని కారకాస్‌లో జూన్ 30న సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా దట్టమైన ఎరుపు, నారింజ రంగుల్లోకి మారిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల భూకంపాలతో అల్లాడిపోయిన వెనిజులాలో మరోసారి భయానక వాతావరణం ఏర్పడింది. వెనిజులా రాజధాని కారకాస్‌లో జూన్ 30న సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా దట్టమైన ఎరుపు, నారింజ రంగుల్లోకి మారిపోయింది. దీంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే రెండు భూకంపాలు దేశాన్ని అతలాకుతలం చేయగా ఆకాశం ఎరుపు రంగులోకి మారడంతో ప్రజలు ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు. ఇది రాబోయే వినాశనానికి సంకేతం అంటూ ఆదేదన వ్యక్తం చేశారు. కాగా ఇప్పటి వరకు వెనిజులాలో భూకంపాల కారణంగా 2వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పటికీ భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింది నుండి చనిపోయిన దేహాలే కాకుండా ప్రాణాలతో ఉన్న వ్యక్తులు, చిన్నారులు బయటకు వస్తున్నారు. దీంతో వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వెనిజులాలో ఆకాశం ఎరుపురంగులోకి మారిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు సైతం వెనిజులా విషయంలో ఆందోళన చెందుతున్నారు. వెనిజులాను దేవుడే రక్షించాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.






