- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంపు కొడుతున్న కొత్త మల్లూరు డ్రైనేజీ..
కొత్తమల్లూరు గ్రామంలోని పలు కాలనీల్లోని అంతర్ఘత రోడ్డ పరిస్థితి దారుణంగా ఉంది.

దిశ, మంగపేట: మండలం కొత్తమల్లూరు గ్రామంలోని పలు కాలనీల్లోని అంతర్ఘత రోడ్డ పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్డుకు ఇరువైపుల ఉన్న డ్రైనేజీలు ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తతో నిండు పూడిక తీయక పోవడంతో ఇళ్లలోని వర్థనీరు డ్రైనీలో కాకుండా రోడ్లపై పారుతూ దుర్ఘంధం వెదజల్లుతున్నాయి. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ పంచాయతీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై చిరు జల్లులు పడుతుండగా.. వచ్చే వరదనీటితో పాటు ఇళ్లలోని వ్యర్థనీరు రోడ్లపై పారుతుండడంతో గ్రామంలోని పందులు, కుక్కలు వరద నీటిలో బొర్లి దుర్ఘంధం వెదజల్లుతున్నాయని ఫలితంగా దోమలు, ఈగలు ప్రబలి గ్రామంలో సీజనల్ వ్యాధులతో ప్రజలు వైరల్ ఫీవర్, డెంగీ, మలేరియా, ఫైలేరియాల బారినపడే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి, డ్రైనీజీల్లోని పూడికలు తొలగించి పారిశుద్యం పనులు చేపట్టి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని కోరుతున్నారు.






