- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెన్నులో వణుకు పుట్టించే సైకలాజికల్ థ్రిల్లర్‌తో రాబోతున్న అనన్య నాగళ్ల.. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే భారీ హైప్
ఈ సినిమాలో అనన్య నాగళ్ల పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వైవిధ్యమైన పాత్రలతో తన పాపులారిటీని పెంచుకుంటున్నారు. ఇటీవల ‘లేచిందీ మహిళా లోకం’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ భామ, ప్రస్తుతం ఒక సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘లీసా’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ విలక్షణమైన చిత్రానికి జవహర్ లాల్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఓంశ్రీరామ్ ఆర్ట్స్, అయాన్ష్ రెడ్డి ప్రజెంట్స్, ఐరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మాతలు వెంకట్ దుగ్గిరెడ్డి, ఇలా రామకృష్ణ సంయుక్తంగా అత్యున్నత నిర్మాణ విలువలతో, ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాగా, మేకర్స్ శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా చిత్రబృందం.. ఈ సినిమాలో అనన్య నాగళ్ల పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో అనన్య ముఖమంతా తీవ్రమైన గాయాలతో, చుట్టూ రక్తం మరకలతో ఎంతో భయానకంగా కనిపిస్తున్నారు. మిమ్మల్ని థియేటర్ సీటుకే కట్టిపడేసేలా, ఉత్కంఠభరితంగా వెన్నులో వణుకు పుట్టించేలా ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఉండబోతోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాలో అనన్య నాగళ్ల లీసా అనే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా, ఈ సినిమాలో ఆమె విభిన్నమైన, షాకింగ్ కోణాలతో కూడిన ఒక అద్భుతమైన నటనను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి అవార్డు గెలుచుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం అద్భుతమైన స్క్రీన్‌ప్లేకి తగ్గట్టుగా, కళ్లు చెదిరే విజువల్స్‌ను చాలా రిచ్‌గా రూపొందించారు. అనన్య నాగళ్ల షాకింగ్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె చుట్టూ ఉన్న రక్తం మరకలు, ముఖంపై గాయాలు చూస్తుంటే ఈ సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వబోతుందని అర్థమవుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిలో భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది.






