ఈ సినిమాలో ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా: శివానీ నాగరం

by Mallepaka Hamsa |

తమిళంలో తాను నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో చాలా సంతోషంగా ఉందని ఆమె ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు.

ఈ సినిమాలో ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా: శివానీ నాగరం
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శివానీ నాగరం అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకులను మనసులు గెలుచుకున్నారు. అంబాజీపేట్ మ్యారెజి బ్యాండు, హే బలవంత్ చిత్రాల్లో నటించిన ఆమె తన అందం, అభినయంతో కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు. అదే జోష్‌లో ఉన్న శివానీకి కోలీవుడ్‌లో ఓ బంపర్ అందుకున్నారు. టూరిస్ట్ ఫ్యామిలీ’, ‘విత్ లవ్’ వంటి చిత్రాలతో వరుస హిట్లు సాధించి మంచి ఫామ్‌లో ఉన్న అభిషన్ జీవింత్ హీరోగా రాబోతున్న సరికొత్త ప్రాజెక్ట్‌లో శివానీ నాగరం హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా యోగలక్ష్మి నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఒక అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనుండటం విశేషం. గౌతమ్ శివరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డ్రామా కంపెనీ సమర్పణలో నిర్మాత ఎ. బాలమురుగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హీరోయిన్ శివానీ కూడా అంతే యాక్టివ్‌గా ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం చిత్రబృందం హీరో అభిషన్, శివరాజ్‌కుమార్, శివానీ మధ్య వచ్చే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ షూటింగ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియోను శివానీ నాగరం తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తమిళంలో తాను నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో చాలా సంతోషంగా ఉందని ఆమె ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. తనకు కొద్దిగా తమిళ భాష కూడా వస్తుందని, ఈ సినిమా తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని శివానీ పేర్కొన్నారు. ముఖ్యంగా లెజెండరీ నటుడు శివరాజ్‌కుమార్ సార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం తన అదృష్టమని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అలాగే హీరో అభిషన్ చాలా ప్రతిభావంతుడని, ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని శివానీ వెల్లడించారు.

Next Story