ఎన్నికల్లో అమరావతినో.. మావిగన్‌నో తేల్చుకుందా: మాజీ సీఎం జగన్ సవాల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-01 08:24:22  IST  )

వచ్చే ఎన్నికల్లో తన విధానమేంటో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తేల్చేశారు. గతంలో చెప్పినట్లుగా ‘మావిగన్’ కే కట్టుబడి ఉన్నామని ఆయ స్పష్టం చేశారు. ...

ఎన్నికల్లో అమరావతినో.. మావిగన్‌నో తేల్చుకుందా: మాజీ సీఎం జగన్ సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో తన విధానమేంటో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తేల్చేశారు. గతంలో చెప్పినట్లుగా ‘మావిగన్’ కే కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు అది నచ్చితేనే తనకు ఓటు వేయాలని లేదంటే వద్దని జగన్ చెప్పారు. అమరావతి నచ్చితే చంద్రబాబుకు ఓటు వేయాలన్నారు. ఎన్నికల్లో అమరావతినో.. మావిగనో తేల్చుకుందామని సవాల్ విసిరారు. 2029 ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అని జగన్ నిక్కచ్చిగా మాట్లాడారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ అమరావతి, మావిగన్‌తో పాటు గాదె సాయికృష్ణ ఉదంతంపై ఆయన స్పందించారు. ‘మావిగన్’ అజెండాతోనే ఎన్నికలు వెళ్తామన్నారు. తమ మేనిఫెస్టోలో కూడా ఉంటుందని జగన్ తెలిపారు. మచిలీపట్నం, విజయవాడ, అమరావతి మూడు కనెక్టింగ్ ఉంటుందన్నారు. అమరావతిలో కాకుండా కట్టే బిల్డింగులు ఇక్కడ కడితే చాలు బ్రహ్మాండమైన రాజధాని తయారవుతోందని జగన్ పేర్కొన్నారు.

అమరావతిని త్వరగా పూర్తి చేసేందుకు కూటమి ప్రయత్నం

కాగా కూటమి ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తోంది. అలాగే రాజధాని అమరావతిగా చట్టం కూడా చేసింది. విధ్వంసం నుంచి వికాసం వైపు వెళ్తున్నామని ఇప్పటికే చాలా సభల ద్వారా సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రసంగించారు. అంతేకాదు కాల సమయం పెట్టుకుని కొన్ని బిల్డింగులను కూడా కట్టింది. మరి కొన్ని నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. అటు కేంద్రప్రభుత్వం కూడా కేంద్రకార్యాలయాలు ఏర్పాటుకు సైతం ముందుకు వచ్చింది. అటు అభివృద్ధికి సంబంధించిన నిధులను సైతం విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో తన విధానాన్ని జగన్ క్లియర్ కట్‌గా చెప్పారు. మరి జగన్ విధానానికి ఎంత మద్దతు లభిస్తుందో, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Next Story