- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకప్ వార్తలకు చెక్ పెట్టిన కృతి సనన్.. పోస్ట్‌తో రిలేషన్‌షిప్ కన్ఫార్మ్!
ఈ ఫొటోల ద్వారా ఆమె తన బ్రేకప్ రూమర్స్‌కు పూర్తిగా చెక్ పెట్టడమే కాకుండా, కబీర్‌తో తన రిలేషన్‌షిప్‌ను అధికారికంగా కన్ఫామ్ చేసినట్లు అయ్యింది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి సనన్ ఇటీవల ‘కాక్‌టయిల్-2’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడంతో.. ఫుల్ జోష్‌లో ఉన్న కృతి సనన్, తాజాగా తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. గత కొంతకాలంగా ఆమె లండన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కబీర్ బాహియా తో ప్రేమలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల మనస్పర్థల కారణంగా ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుని విడిపోయారంటూ నెట్టింట పెద్ద ఎత్తున పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ బ్రేకప్ వార్తలపై కృతి సనన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. గత ఆరు నెలలకు సంబంధించిన కొన్ని అరుదైన, అన్‌సీన్ క్షణాలను ‘హాఫ్ ఇయర్లీ డంప్’ పేరుతో అభిమానులతో పంచుకున్నారు.
ఈ ఫొటోల ద్వారా ఆమె తన బ్రేకప్ రూమర్స్‌కు పూర్తిగా చెక్ పెట్టడమే కాకుండా, కబీర్‌తో తన రిలేషన్‌షిప్‌ను అధికారికంగా కన్ఫామ్ చేసినట్లు అయ్యింది. ఈ పోస్ట్‌లో కృతి తన పెంపుడు కుక్కతో చేసిన ప్రయాణాలు, సోదరి నుపూర్ సనన్‌తో కలిసి ఎంజాయ్ చేసిన స్నో వెకేషన్, అలాగే ‘కాక్‌టయిల్-2’ కో-స్టార్ రష్మిక మందన్నతో ఉన్న పిక్స్‌ను షేర్ చేశారు. ఈ ఫొటోలన్నింటిలో కెల్లా హైలైట్‌గా నిలిచింది మాత్రం కబీర్ బాహియాతో ఉన్న ఫొటోనే అని చెప్పాలి. ఒక లైవ్ పర్ఫార్మెన్స్ చూస్తూ కృతి, కబీర్ ఒకరినొకరు ఎంతో ప్రేమగా కౌగిలించుకుని ఉన్న అద్భుతమైన పిక్‌ను ఆమె ఇందులో షేర్ చేయడం విశేషం. ఈ ఫొటోలో కబీర్ సాంప్రదాయక షేర్వాణీలో మెరిసిపోతుండగా, కృతి మాత్రం బ్లాక్ హుడీ ధరించి చాలా క్యాజువల్ లుక్‌లో కనిపించారు. ఈ క్యూట్ పిక్ చూసిన అభిమానులు వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్న మాట వాస్తవమేనని ఫిక్స్ అయిపోయారు. దీంతో అప్పటివరకు నడిచిన బ్రేకప్ వార్తలకు ఒక్కసారిగా బ్రేక్ పడిపోయింది. అయితే, ఈ ఫొటోలో కబీర్ షేర్వాణీలో ఉండటంతో ఇప్పుడు నెట్టింట సరికొత్త పెళ్లి పుకార్లు జోరందుకున్నాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, అందుకే ఈ రేంజ్‌లో హింట్ ఇచ్చారంటూ నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.






