- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health Tips: ప్రాసెస్ చేసిన మాంసం క్యాన్సర్ కారకమా..?
అధికంగా ప్రాసెస్ చేసిన మాంసాహారాలు కొలొరెక్టల్ క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

దిశ, ఫీచర్స్ : మాంసాహారం ఆరోగ్యానికి మంచిదే కానీ, అధికంగా ప్రాసెస్ చేసిన మాంసం హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) కూడా ప్రాసెస్డ్ మీట్‌ను Group 1 కార్సినోజెన్గా వర్గీకరించింది. ఇది ధూమపానం, ఆల్కహాల్, అస్బెస్టాస్ వంటి పదార్థాలతో సమాన స్థాయిలో ఉందని గుర్తించింది. ముఖ్యంగా ఇందులో రుచిని పెంచడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు అధిక ఉప్పు, నైట్రేట్స్, నైట్రైట్స్, పొగబెట్టడం వంటి రసాయనాలు చేర్చడం వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
హామ్, బేకన్, సాసేజెస్, హాట్ డాగ్స్, సలామి, నాగెట్స్, స్మోక్డ్ మీట్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలు ఈ కోవలోకి వస్తాయి. రెగ్యులర్‌గా లేదా వారానికి ఎక్కువ మొత్తంలో వీటిని తినేవారిలో పెద్దప్రేగు క్యాన్సర్ (Colorectal Cancer) ప్రమాదం పెరుగుతుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అయితే IARC వర్గీకరణ ఈ ఆధారాల ద్వారానే జరిగింది. వ్యక్తిగత రిస్క్ ఎంత ఉందనే అంచనా మాత్రం ఇందులో లేదు. కాకపోతే రోజూ లేదా వారంలో ఎక్కువసార్లు తినే అలవాటు ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడేస్తుంది. నిపుణుల సూచన ప్రకారం.. ప్రాసెస్డ్ మీట్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ మోతాదు తగ్గించి, తాజా మాంసం, చికెన్, ఫిష్, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పప్పులు, నట్స్ వంటి సహజ ప్రోటీన్ సోర్సెస్‌ను ఎక్కువగా తీసుకోవాలి. ఇంట్లో వండిన తాజా ఆహారం, బ్యాలెన్స్‌డ్ డైట్‌ను అనుసరించడం ద్వారా క్యాన్సర్‌తో సహా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. హెల్తీ ఫుడ్ హాబిట్స్ ఆరోగ్యాన్ని సంరక్షించడం ద్వారా మానవ జీవితకాలాన్ని కూడా పెంచుతాయి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






