- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాఘవ్ చద్దాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట
బీజేపీ ఎంపీ రాఘవ్ చద్దాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట.. 'డబ్బుకు అమ్ముడుపోయాడు' అంటూ సోషల్ మీడియాలో పెట్టిన అపవాదు పోస్టుల తొలగింపునకు ఆదేశం!

దిశ, వెబ్ డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుంచి ఇటీవల భారతీయ జనతా పార్టీ (BJP) లోకి మారిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (MP Raghav Chadha)కు ఢిల్లీ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. రాఘవ్ చద్దా "డబ్బుకు అమ్ముడు పోయాడు" అంటూ సర్క్యులేట్ అవుతున్న ఐదు వివాదాస్పద పోస్టులను తక్షణమే తొలగించాలని (Takedown) బుధవారం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.
రాజకీయ విమర్శల సరిహద్దు దాటారు.. కోర్టు వ్యాఖ్యలు
రాఘవ్ చద్దా తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ నాయర్ వాదనలు వినిపిస్తూ.. చద్దా రాజకీయ పార్టీ మారడాన్ని విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుందని, కానీ ఏఐ (AI) సాంకేతికతతో కూడిన డీప్‌ఫేక్స్, మార్ఫింగ్ వీడియోలను ఉపయోగించి ఆయన క్యారెక్టర్‌ను దెబ్బతీసేలా, డబ్బు కోసమే పార్టీ మారారనే అపవాదు వేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. సదరు పోస్టులు ఆరోగ్యకరమైన రాజకీయ విమర్శల సరిహద్దులను దాటి, వ్యక్తిగత పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే, ఈ కేసులో 'పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘన అంశం ప్రమేయం లేదని, ఇది కేవలం పరువు నష్టం పరిధిలోకి వస్తుందని కోర్టు స్పష్టం చేస్తూ, పూర్తిస్థాయి వివరణాత్మక ఆర్డర్‌ను త్వరలోనే అప్‌లోడ్ చేస్తామని తెలిపింది.






