బోల్డ్ అండ్ రా అండ్ రస్టిక్‌గా టాక్సిక్ లేడీస్ & లేడీస్ గ్లింప్స్.. ఒక్కసారిగా బుర్రపాడు చేసే కంటెంట్ వదిలిన టీమ్

by Chukka Sudharani |   (  Updated:2026-07-01 08:07:54  IST  )

యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ నుంచి లేడీస్ & లేడీస్ గ్లింప్స్ రిలీజ్ చేసి ఒక్కసారిగా సినిమాపై భారీ హైప్ పెంచేశారు మేకర్స్.

బోల్డ్ అండ్ రా అండ్ రస్టిక్‌గా టాక్సిక్ లేడీస్ & లేడీస్ గ్లింప్స్.. ఒక్కసారిగా బుర్రపాడు చేసే కంటెంట్ వదిలిన టీమ్
X

దిశ, సినిమా: కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టాక్సిక్’. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఎన్నో వాయిదాల తర్వాత ఆగస్టు 26న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. అయితే.. ప్రేక్షకులను థియేట‌ర్ల‌కు తీసుకురావాలంటే టీజ‌ర్, ట్రైల‌ర్ లేదా ప్రమోష‌న‌ల్ కంటెంట్‌తో ఏదో ఒక మ్యాజిక్ చెయ్యాలి. దీంతో ఈ సినిమాని థియేటర్లోనే చూడాలి అనే ఫీలింగ్ ఆడియన్స్‌లో కలగాలి.

ఈ క్రమంలోనే టాక్సిక్ ప్రమోష‌నల్ కంటెంట్ అలాంటి ఓ ఫీల్‌ను ప్రేక్షకుడికి ఇచ్చేసింది. రిలీజ్‌కు సిద్ధం అవుతున్న ఈ చిత్రం నుంచి ‘లేడీస్ & లేడీస్’ అంటూ ఓ స్పెషల్ గ్లింప్స్‌ను షేర్ చేశారు మేకర్స్. బోల్డ్ అండ్ రా అండ్ ర‌స్టిక్‌గా స్టైలీష్ మేకింగ్‌తో వచ్చిన ఈ గ్లింప్స్ ఒక్కసారిగా బుర్ర పాడు చేసేసింది. రొమాంటిక్ సీన్స్‌తో పాటు యాక్షన్స్‌తో కావ‌ల్సినంత కంటెంట్‌ను ఇచ్చేసింది. ఇక ఇందులో గంగా పాత్రలో నయనతార, మెల్లిసాగా రుక్మిణి వసంత్, నదియాగా కియారా అద్వానీ, ఎలిజబెత్‌గా హుమాఖురేషి, రెబెక్కాగా తారాసుతారియా ఎంట్రీస్ ప్రేక్షకులకు పిచ్చేక్కిస్తున్నాయి. ‘‘లేడీస్ & లేడీస్’ ఒక్కొక్కరిగా వస్తారా.. ఒకేసారి వస్తారా’ అంటూ సాగిన ఈ గ్లింప్స్ మొత్తంగా సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తుంది.

Next Story