- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొమ్మిదేళ్ల వయసులోనే లైంగిక దాడి .. ఆ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుని అయేషా ఖాన్ ఎమోషనల్ కామెంట్స్
అడ్రస్ చూపించాక మేము తిరిగి మెట్లు దిగుతున్న సమయంలో ఆ వ్యక్తి బుద్ధి మార్చుకున్నాడు. ఒక్కసారిగా నన్ను మెట్లపైకి తోసేసి, నాపై బలవంతం చేయడం, పశువులా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అయేషా ఖాన్ బిగ్‌బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చిన ఆమె తెలుగులో ఓం భీం బుష్, గ్యాంగ్ ఆఫ్ గోదావరి, మనమే, ముఖ చిత్రం వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక బాలీవుడ్‌లో ధురంధర్, జాట్ సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకోవడంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. ఇటీవల వెల్ కమ్ టు ది జంగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ‘ది ఇ-ఘోస్ట్’ మూవీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయేషా, తన తొమ్మిదేళ్ల వయసులో ఒక పోస్ట్‌మ్యాన్ తనపై లైంగిక దాడికి ఒడిగట్టిన భయంకరమైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘ఆరోజు నేను ఫ్రిల్స్ ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫ్రాక్, లోపల ప్యాంట్ వేసుకుని ఉన్నాను. అప్పుడు పీచ్ కలర్ షర్ట్ వేసుకుని, చేతిలో లెటర్స్ బ్యాగ్ పట్టుకున్న ఒక వ్యక్తి నన్ను పేరు పెట్టి పిలిచాడు. తన చేతిలో ఉన్న కొన్ని ఉత్తరాలను చూపిస్తూ ఆ అడ్రస్ ఎక్కడుందో చెప్పాలని అడిగాడు. అది నేను ఉంటున్న ఇంటి వెనుక వైపు ఉన్న పింక్ కలర్ బిల్డింగ్ అడ్రస్ కావడంతో.. అవును అంకుల్ తెలుసు, రండి చూపిస్తా అంటూ చాలా అమాయకంగా అతని వేలు పట్టుకుని ఆ బిల్డింగ్ మొదటి అంతస్తుకు తీసుకెళ్లాను. అయితే, అక్కడ అడ్రస్ చూపించాక మేము తిరిగి మెట్లు దిగుతున్న సమయంలో ఆ వ్యక్తి బుద్ధి మార్చుకున్నాడు. ఒక్కసారిగా నన్ను మెట్లపైకి తోసేసి, నాపై బలవంతం చేయడం, పశువులా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
ఆ వయసులో అసలు నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ ఏదో చాలా పెద్ద తప్పు జరుగుతోందని మాత్రం మనసుకు తెలిసింది. నేను భయంతో గట్టిగా కేకలు వేద్దామన్నా ఆ వ్యక్తి నా నోటిని చేత్తో బలంగా నొక్కేసి ఊపిరాడకుండా చేశాడు. ఆ భయానక స్థితిలో నాకు మా అమ్మ మాత్రమే గుర్తొచ్చింది. ప్లీజ్ అంకుల్ నన్ను వదిలేయండి, మా అమ్మ అక్కడే నిలబడి ఉంది, నన్ను చూస్తోంది అని ఏడుస్తూ ఎంత బ్రతిమిలాడినా ఆ కామాంధుడు వినలేదు, నన్ను వదల్లేదు. చివరకు దేవుడి దయ వల్ల ఆ వ్యక్తిలో ఏం ఆలోచన వచ్చిందో ఏమో కానీ, హఠాత్తుగా నన్ను పక్కకు నెట్టేసి వదిలేశాడు. చాలా పొడవుగా ఉన్న ఆ వ్యక్తి నా వైపు కోపంగా చూస్తూ.. ఇక్కడే ఉండు, రెండు నిమిషాల్లో మళ్లీ వస్తా అని చెప్పి పక్కకు వెళ్లాడు. ఆ క్షణంలో నేను అక్కడే ఉండాలా లేక పారిపోవాలా అని భయంతో వణికిపోతూ ఆలోచిస్తున్నాను. అంతలోనే అతను బిల్డింగ్ వింగ్ దాటి అవతలికి వెళ్తున్నట్లు కనిపించింది. వెంటనే నా మనసు ఆయేషా.. ఇక ఆలోచించకు, ఇక్కడి నుండి ప్రాణాలు పట్టుకుని పారిపో అని గట్టిగా హెచ్చరించింది. దాంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి వేగంగా పరుగెత్తి ఎలాగోలా ప్రాణాలు దక్కించుకున్నాను" అంటూ ఆయేషా ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






