అబద్ధాలు చెబితే జాబ్ వస్తుందని అనుకోకండి: కల్వకుంట్ల కవిత

by Prasad Jukanti |   (  Updated:2026-07-01 06:40:44  IST  )

జాబ్ కోసం ఇంటర్వ్యూల్లో అబద్ధాలు చెప్పొద్దని యువతకు కల్వకుంట్ల కవిత కీలక సూచనలు చేశారు.

అబద్ధాలు చెబితే జాబ్ వస్తుందని అనుకోకండి: కల్వకుంట్ల కవిత
X

దిశ, డైనమిక్ బ్యూరో: సక్సెస్‍ అయ్యేందుకు షార్ట్ కట్ లేదని కేవలం హార్డ్ వర్క్ ద్వారానే సక్సెస్ అవుతామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాబ్ కోసం ఇంటర్వ్యూలో అబద్దం చెప్పవద్దని, తెలియని విషాలను తెలియదనే చెప్పాలన్నారు. ఇంటర్వ్యూలో అబద్ధాలు చెబితే జాబ్ వస్తుందని అనుకోవద్దని, అభ్యర్థులు విశ్వాసంతో ఉంటే జాబ్ అదే వస్తుందన్నారు. తాజాగా మెహదీపట్నంలోని కింగ్స్ ప్యాలెస్‍లో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్న కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దాదాపు 150 కంపెనీలతో 2 వేల ఉద్యోగాలిచ్చే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం సంతోషకరం అన్నారు. జెన్యూన్‍గా అర్హత ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కంపెనీలను కోరుతున్నానన్నారు. ఇక్కడకు వచ్చిన వారిలో ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లొమా చేసిన వాళ్లతో పాటు టెన్ పాస్ అయిన వాళ్లు కూడా ఉన్నారని వాళ్లందరికీ వాళ్ల అర్హతలకు తగిన విధంగా జాబ్ మేళాలో జాబ్స్ ఇచ్చే అవకాశం ఉందన్నారు.

అంతటి క్రైసిస్ లోనూ జాబ్ సాధించా:

ఇక్కడకు వచ్చిన యువతకు ఒకటే చెబుతున్నాను.. ఫస్ట్ జాబ్ అనేది చాలా ముఖ్యం. మీకు ఏమి వచ్చో అదే నిజాయితీగా చెప్పాలన్నారు. అవసరమైతే టైమ్ ఇస్తే నేర్చుకుంటాను అని చెప్పాలని సూచించారు. యూఎస్‍లో నా ఫస్ట్ జాబ్ విషయంలో నేను అదే చేశాననని గుర్తు చేశారు. 2001లో యూఎస్‍లో జాబ్ క్రైసెస్ ఉన్న సమయంలో నేను ఇంటర్వ్యూకు వెళ్లాను. వాళ్లు అడిగిన వాటికి నాకు సమాధానం తెలియకపోతే తెలియదు అని చెప్పాను. కానీ 20 రోజులు సమయం ఇస్తే నేర్చుకుంటాను అన్నాను. వాళ్లు టైమ్ ఇచ్చారు. నేను నేర్చుకొని జాబ్ సంపాదించినట్లు తెలిపారు. అంతటి క్రైసిస్ సమయంలోనూ నేను జాబ్ సాధించానని మీరు కూడా మీకు తెలియనిది తెలియదు చెప్పి టైమ్ ఇస్తే నేర్చుకుంటానని నిజాయితీగా చెప్పాలన్నారు. హార్డ్ వర్క్ మాత్రమే మిమ్మల్ని కాపాడుతుందని మీరు ఏం నేర్చుకోవాలన్న ఫ్రీగా యూట్యూబ్ లో నేర్చుకోవచ్చన్నారు. ఫార్మాల్ కాలేజ్‍లలో ఇప్పుడు 70 శాతం అమ్మాయిలే చేరుతున్నారు. వారికోసం 70 శాతం జాబ్ మార్కెట్ ఉన్నట్లేనని కచ్చితంగా జాబ్ వస్తుందన్న విశ్వాసంతో ఉండాలన్నారు. ఒకవేళ జాబ్ రాకపోయినా సరే మళ్లీ ధైర్యంగా ప్రయత్నం చేయాలని సూచించారు.

Next Story