- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 10 మందికి తీవ్ర గాయాలు
by Kodari Anjali |
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రాజీవ్ రహదారిపై బుధవారం రోడ్డు క్రాస్ చేస్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి.

X
దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయం ఎదుట ఉన్న రాజీవ్ రహదారిపై బుధవారం రోడ్డు క్రాస్ చేస్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. వివరాలు స్థానికుల కథనం మేరకు.. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రాజీవ్ రహదారి పై ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తున్న లారీని కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసి బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి గాయలయ్యాయి. క్షత్తగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరీంచారు. సంఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






