రాష్ట్రంలో దారుణం.. భార్య, కూతురు చంపి రియల్టర్ ఆత్మహత్య

by Ajay Maddhiboyina |   (  Updated:2026-07-01 05:52:42  IST  )

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య, కూతురును హత్య చేసి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా కోట్టైకోలివ్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

రాష్ట్రంలో దారుణం.. భార్య, కూతురు చంపి రియల్టర్ ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య, కూతురును హత్య చేసి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా కోట్టైకోలివ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. డీఎంకే నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి సంతోష్ (45) తన భార్య శరణ్య(36), కూతురు సాత్విక(14) తో కలిసి కోట్టైకోలివ్‌లో నివాసం ఉంటున్నాడు. సంతోష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా భర్య గృహిణి, కుమార్తె 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ట్టు తెలుస్తోంది. మంగ‌ళ‌వారం బాలిక పాఠ‌శాల‌కు వెళ్లగా సంతోష్ స్కూల్ నుండి ఇంటికి తీసుకువ‌చ్చాడు. అనంత‌రం భార్య‌ను గొంతునులిమి హ‌త్య చేయ‌గా కుమార్తెను సుత్తితో త‌ల‌పై కొట్టి హ‌త్య చేశాడు.

త‌ర‌వాత అక్క‌డ నుండి బైక్ తీసుకుని బ‌య‌ట‌కు వెళ్లాడు. ఘ‌ట‌న‌పై స్థానికులు స‌మాచారం ఇవ్వ‌డంతో పోలీసులు రంగంలోకి దిగి విచార‌ణ మొద‌లుపెట్టారు. పోలీసులు మృత‌దేహాల‌ను పోస్టుమార్టానికి త‌ర‌లించ‌గా అంత‌లోపే సేలం ధ‌ర్మ‌పురి హైవేలో ఓ వ్య‌క్తి లారీ కింద‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు పోలీసుల‌కు స‌మాచారం అందింది. పోలీసులు ఘ‌ట‌నాస్థలానికి వెళ్లి చ‌నిపోయింది సంతోష్ అని నిర్దారించారు. వ్యాపారంలో న‌ష్టాలు రావ‌డం వ‌ల్ల సంతోష్ భార్య‌, కుమార్తెను హ‌త‌మార్చి త‌ను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా లేదంటే మ‌రేదైనా కార‌ణం ఉందా అని పోలీసులు విచారిస్తున్నారు.

Next Story