- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నా కాపాడండి.. నాకు పిల్లలున్నారు
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై ఓ లారీ డివైడర్ ఎక్కి మరో లారీని ఢీకొట్టింది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై ఓ లారీ డివైడర్ ఎక్కి మరో లారీని ఢీకొట్టింది. లారీ పేపర్ లోడ్ తో వెళుతుండటంతో ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించి లారీ మొత్తం తగలబడిపోయింది. ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు క్లీనర్లు సైతం అక్కడిక్కడే సజీవదహనం అయ్యారు. మంటలు అంటుకున్న సమయంలో ఓ లారీ డ్రైవర్ అన్నా కాపాడండి నాకు పిల్లలు ఉన్నారు అంటూ ఆర్తనాదాలు చేశారు. అయినప్పటికీ చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఎలాంటి సహాయం చేసే స్థితిలో లేకపోవడంతో మంటల్లోనే మరణించారు. ఘటన జరిగిన అనంతరం పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకుని విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన హృదయవిదారకమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






