- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ.. రూ. 15 కోట్లతో రోడ్డు విస్తరణతో పాటు డ్రైనేజ్ నిర్మాణం
రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో మంథని టౌన్ మాస్టర్ ప్లాన్ తో పట్టణ రూపు రేఖలు మారనున్నాయి.

దిశ, మంథని: రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో మంథని టౌన్ మాస్టర్ ప్లాన్ తో పట్టణ రూపు రేఖలు మారనున్నాయి. మంథని పట్టణ అభివృద్ధితో పాటు సుందరికరణకు సర్వం సిద్ధం అవుతుంది. దీంతో మంథని పట్టణం కరీంనగర్ లాంటి సిటీని తలపించే విధంగా మారనుంది. ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు మంథని పట్టణంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కొరకు కోట్లాది రూపాయల నిధులను కేటాయించారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయి.కొన్ని చివర దశకు చేరుకున్నాయి. మరి కొన్ని నిర్మాణంలో ఉన్నాయి.దింతో మంథని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
15 కోట్లు... రోడ్డు విస్తరణ డ్రైనేజ్ నిర్మాణం
పట్టణంలోని ఆర్టీసీ బస్సు డిపో నుండి పాత పెట్రోల్ బాంక్ వరకు రోడ్డుకు ఇరు వైపులా 100 పిట్లతో రోడ్డు వేడెల్పుతో పాటు డ్రైనేజ్ నిర్మాణం చేయనున్నారు. దీనికి కొరకు ఇప్పటికే డిఎంఎఫ్టి ఆర్&బి నిధులతో 15 కోట్లతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికె మున్సిపల్ పరిధిలో ఉన్న 18 షాపుల వ్యాపారులు, 12 జిపీ కాంప్లెక్స్ వ్యాపారులతో పాటు మెయిన్ రోడ్డు మీద పండ్ల వ్యాపారులు స్వచ్చందంగా షాపు ముందు ఉన్న రేకులను తొలగిస్తున్నారు. అయితే రెండు నెలల్లో రోడ్డు తో పాటు డ్రైనేజ్ నిర్మాణం పూర్తి కానుంది. ఇదే కాక డిపో,పెట్రోల్ బాంక్ తో పాటు విగ్రహల దగ్గర జంక్షన్ల వేడెల్పు ఇప్లిమెంట్ చేయనున్నారు. దీంతో మంథని పట్టణం మోడల్ సిటీ గా మారనుంది.
6.40 కోట్లతో వెజ్ నాన్ వెజ్ నిర్మాణం..
పట్టణంలో ఉన్న పాత కూరగాయల మార్కెట్‌ను కూల్చివేశారు. దాని స్థానంలో 6.40 కోట్లతో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను నిర్మించనున్నారు. జీ+1 తో షాపింగ్ కాంప్లెక్స్ తో పాటు కూరగాయల మార్కెట్ నిర్మించనున్నారు. సంవత్సరం తర్వాత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రజలకు వ్యాపారులకు అందుబాటులోకి రానుంది.
మోడల్ టౌన్‌కు సర్వం సిద్ధం...
అయితే మంథనిని రాష్టంలో మంథని పట్టణంను మోడల్ టౌన్ గా తీర్చిదిద్దుతానని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పలు సందర్బల్లో చెప్పారు. దీంతో ఇప్పటికే మంథని పట్టణంలో మున్సిపల్ ఆఫీస్, ప్రభుత్వ ఆసుపత్రి, సమీకృత ఆర్డీఓ కార్యాలయం, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, పట్టణంలో రోడ్డు వేడెల్పు, కుల సంఘాల భవనాలతో పాటు మరిన్ని అభివృద్ధి పనులకు పట్టణంలో కోట్లాది రూపాయల నిదులు కేటాయించారు. అయితే నియోజకవర్గం కేంద్రం అయిన ఇప్పుడు మంథని పట్టణంగా ఉంది. దీంతో పట్టణం రాష్టములోనే మోడల్ టౌన్ సిటీగా మారనుంది. దీంతో త్వరలో మంథని జిల్లా కొరకు అడుగులు పడుతున్నట్లు మేధావులు, రాజకీయ విశ్లేషకులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, నియోజకవర్గ ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది మంత్రి శ్రీధర్ బాబుతోనే సాధ్యం అంటున్నారు నియోజకవర్గం ప్రజలు.






