మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి..

by Kodari Anjali |

కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలను విరమించి, గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి..
X

దిశ, ఖమ్మం రూరల్: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలను విరమించి, గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వి.జి.బి–రాంజీ జీ పథకాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, గిరిజన సంఘం, సీఐటీయూ కేంద్ర కమిటీల పిలుపు మేరకు బుధవారం ఖమ్మం రూరల్ మండలం కస్నాతండా గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఉపాధి కూలీలతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ బానోతు పాపా నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ, గ్రామీణ పేదల జీవనాధారమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఏడాదికి 100 రోజుల ఉపాధిని సమర్థవంతంగా కల్పించాలని, పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, కూలీల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు భూక్యా నాగేశ్వరరావు, అవిరేణి గురవయ్య, గురవయ్య, భాస్కర్, వీర, వెంకన్న, బాబు, దేవజీ, గోపాల్‌రావు, బిచ్చా తదితరులు పాల్గొన్నారు.

Next Story