- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారం ప్రియులకు శుభవార్త.. మరోసారి తగ్గిన ధరలు
by Malleboina Mahesh |
బంగారం ధరలు మరోసారి భారీగా డౌన్.. 24 క్యారెట్లపై రూ.1,260 తగ్గి రూ.1,40,780కి చేరిన పసిడి రేట్.. వెండి మాత్రం కిలో రూ.2,45,000 వద్దే స్థిరం!

X
దిశ, వెబ్ డెస్క్: పసిడి ప్రేమికులకు, కొనుగోలుదారులకు బుధవారం మరోసారి భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన సానుకూల పరిణామాల నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు (Gold prices) వరుసగా మూడో రోజు కూడా భారీగా పతనం అయ్యాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల (మేలిమి) బంగారం ధర ఏకంగా రూ. 1,260 తగ్గి రూ. 1,40,780 కి చేరింది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 1,150 మేర తగ్గి రూ. 1,29,050 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు ఇలా దిగి రావడంతో జ్యువెలరీ షాపులు కస్టమర్లతో సందడిగా మారాయి. అయితే, పసిడి దారిలో కాకుండా వెండి ధరలు మాత్రం నేడు మార్కెట్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 2,45,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
Next Story






