తిరుమలలో భక్తుల రద్దీ.. నేడు ఎస్ఎస్డి టోకెన్లు రద్దు చేసిన టిటిడి

by Ajay Maddhiboyina |

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 15 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండగా టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న 80,167 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ.. నేడు ఎస్ఎస్డి టోకెన్లు రద్దు చేసిన టిటిడి
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 15 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండగా టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న 80,167 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,270 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4.1 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నేడు స‌ర్వ‌ద‌ర్శ‌నం స్లాటెడ్ టోకెన్ల జారీని టీటీడీ ర‌ద్దు చేసింది. శుక్ర‌వారానికి సంబంధించిన టోకెన్ల‌ను గురువారం సాయంత్రం కేట‌యిస్తామ‌ని వెల్ల‌డించింది. దీంతో నేడు, రేపు భ‌క్తుల‌కు స‌ర్వ ద‌ర్శ‌నం అందుబాటులో ఉండ‌నుంది. ఇక మొన్న‌టి వ‌ర‌కు స‌మ్మ‌ర్ హాలీడేస్ ఉండటంతో తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. ఇప్పుడిప్పుడే కాస్త త‌గ్గినా భ‌క్త‌ల ర‌ద్దీ మాత్రం క‌నిపిస్తోంది. ముఖ్యంగా వీకెండ్స్ ర‌ద్దీ మ‌రింత పెరుగుతోంది.

Next Story