చేవెళ్లలో కుక్కల బీభత్సం.. 18 మేకలు మృతి!

by Kodari Anjali |

మున్సిపల్ పరిధిలో వీధి కుక్కలు ఘోర కలకలం సృష్టించాయి.

చేవెళ్లలో కుక్కల బీభత్సం.. 18 మేకలు మృతి!
X

దిశ, చేవెళ్ల: మున్సిపల్ పరిధిలో వీధి కుక్కలు ఘోర కలకలం సృష్టించాయి. మంగళవారం అర్ధరాత్రి చేవెళ్ల గ్రామానికి చెందిన రైతు కిష్టయ్య మేకల మందపై కుక్కలు గుంపుగా దాడి చేసి, 18 మేకల పీకలు కోసి చంపేశాయి. మందలోని మిగిలిన 200 గొర్రెలు ప్రాణభయంతో ఊరిలోని కిష్టయ్య ఇంటికి పరుగు తీసి ప్రాణాలు దక్కించుకున్నాయి. విషయం తెలుసుకున్న చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ సమత, 14వ వార్డు కౌన్సిలర్ మద్దెల శ్రీనివాస్ తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడు కిష్టయ్యను పరామర్శించి, ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Next Story