తక్కువ ధరకే విమాన ప్రయాణం.. నేటి నుంచి ఇండిగో సరికొత్త ఆఫర్

by Prasad Jukanti |

కేవలం క్యాబిన్ లగేజీతో ప్రయాణించే వారి కోసం ఇండిగో సరికొత్త 'ఇండిగో లైట్' ఫేర్ తెచ్చింది. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.

తక్కువ ధరకే విమాన ప్రయాణం.. నేటి నుంచి ఇండిగో సరికొత్త ఆఫర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: విమాన ప్రయాణికులకు ప్రముఖ ఎయిర్ లైన్ సంస్థ ఇండిగో (IndiGo) తీపి కబురు చెప్పింది. ఎకానమీ క్లాస్ ప్రయాణికుల కోసం కొత్తగా ఇండిగో లైట్ (IndiGo Lite) పేరుతో ఒక సరికొత్త రాయితీ ఫేర్ ఆప్షన్‌ను ప్రకటించింది. కేవలం క్యాబిన్ లగేజీతో మాత్రమే ప్రయాణించే వారికి తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందించడం, వారు ఉపయోగించుకునే సేవలకు మాత్రమే డబ్బులు చెల్లించేలా ఈ ప్లాన్ తీసుకువచ్చారు. సంస్థ ప్రకారం ఇండిగో లైట్ ఛార్జీతో కేవలం క్యాబిన్ బ్యాగేజీని మాత్రమే తీసుకువెళ్లే కస్టమర్లు, తాము ఉపయోగించుకునే సేవలకు మాత్రమే చెల్లించవచ్చని తెలిపింది.

నేటి నుంచి బుకింగ్స్:

ఇండిగో లైట్ ఫేర్ బుకింగ్‌లు 1 జూలై 2026 నుండి ప్రారంభం కాగా 15 జూలై 2026 నుండి ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. దేశీయ (Domestic) మరియు అంతర్జాతీయ (International) నాన్-స్టాప్ రూట్లలో ప్రయాణించే వారందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుందని, వన్-వే, రౌండ్ ట్రిప్, మల్టీసిటీ ప్రయాణాలు చేసే పెద్దలు, పిల్లలు ఇద్దరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ సదుపాయం ఇండిగో అధికారిక వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్, కాంటాక్ట్ సెంటర్ వంటి ప్రత్యక్ష మార్గాల ద్వారా చేసే బుకింగ్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తక్కువ లగేజీతో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే మధ్యతరగతి ప్రయాణికులకు ఎంతో ఊరటనిస్తుందని విమానయాన రంగ నిపుణులు భావిస్తున్నారు.

Next Story