తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను సింగరేణికే కేటాయించాలి..

by Kodari Anjali |

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్ జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను సింగరేణికే కేటాయించాలి..
X

దిశ, ఇల్లెందు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని, 12వ జేబీసీసీఐ (వేతన బోర్డు) సమావేశాన్ని తక్షణమే నిర్వహించాలని ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్ జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఇల్లందు సింగరేణి వర్క్‌షాప్‌ వద్ద కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డీవైఎస్ కల్వోటికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జేఏసీ నాయకులు నజీర్ అహ్మద్, అబ్దుల్ నబీ, ఎల్. మధు, బాల ప్రసాద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను హరించే విధంగా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో 4 లేబర్ కోడ్‌లను రాష్ట్రంలో అమలు చేయబోమని తీర్మానం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.

గ్రామీణ ప్రజల ఉపాధికి భరోసా కల్పించే...

తెలంగాణలోని బొగ్గు బ్లాకులన్నింటినీ సింగరేణికే కేటాయించేలా కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జూన్ 30తో 11వ వేతన బోర్డు గడువు ముగిసినందున, 12వ జేబీసీసీఐ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేసి కార్మికుల వేతన సవరణ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. ఇల్లందు ప్రాంత భవిష్యత్తు కోసం పూసపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని, గ్రామీణ ప్రజల ఉపాధికి భరోసా కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించి, వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జక్కుల శ్రీనివాస్, అబ్బాస్‌తో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Next Story