- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిత్తూరు జిల్లాలో వింత పురుగులు.. 19మంది స్కూల్ విద్యార్థులకు అస్వస్థత
ఏపీలో పురుగులు కుట్టడం ప్రజలకు ఆందోళనకరంగా మారింది. తాజాగా చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం డీఎంపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో చెట్టుపై నుండి పడిన వింత పురుగులు కుట్టడంతో 19 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పురుగులు కుట్టడం ప్రజలకు ఆందోళనకరంగా మారింది. తాజాగా చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం డీఎంపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో చెట్టుపై నుండి పడిన వింత పురుగులు కుట్టడంతో 19 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దద్దుర్లు, మంట రావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురవ్వగా వారిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పాఠశాలకు సెలవు ప్రకటించారు. విద్యార్థులు చెట్ల కింద ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే కుట్టిన పురుగులు వింతగా ఉండటంతో ప్రజలు టెన్షన్ పడుతున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యాసిడ్ పురుగులు రోవ్ బీటిల్స్ బెడద తీవ్రంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, ఏలూరు జిల్లాల్లో వీటివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ పురుగులు ఒంటిపై వాలినప్పుడు చేతులతో నలపకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. వాటిని మెల్లిగా పక్కకు నెట్టివేయాలని చెబుతున్నారు. లేదంటే చర్మంపై దద్దుర్లు వస్తాయని మంట వస్తుందని అంటున్నారు. చర్మంపై దద్దుర్లు వచ్చినా వాటిని కూడా పగలకుండా వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.






