- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గతేడాది తుఫాను బాధిత సహాయం.. త్వరలోనే అందిస్తామన్న ఏపీ ప్రభుత్వం
గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన మొంథా తుఫాను కారణంగా నష్టపోయిన బాధితులకు త్వరలోనే ఆర్థిక సాయం అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన మొంథా తుఫాను కారణంగా నష్టపోయిన బాధితులకు త్వరలోనే ఆర్థిక సాయం అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ.285.61 కోట్ల నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తుఫాను కారణంగా పంటలు, గృహాలు, ఇతర ఆస్తులు దెబ్బతిన్న బాధితులకు ఈ ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంబంధిత శాఖలకు అవసరమైన నిధులను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే 2023లో మిచౌన్గ్ తుఫాను వల్ల నష్టపోయిన సుమారు 50 వేల మంది రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని, ఈ అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఈ బాధితులకు కూడా త్వరలోనే సాయం అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.48.11 కోట్లన ప్రభుత్వం విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన నిధులను కూడా త్వరలో విడుదల చేసి, తుఫాను బాధితులందరికీ ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.






