జొన్న రైతులతో కలెక్టరేట్ వద్ద ధర్నా...

by Kodari Anjali |

రైతులు పండించిన జొన్నలు కొనుగోలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు.

జొన్న రైతులతో కలెక్టరేట్ వద్ద ధర్నా...
X

దిశ, మెదక్ ప్రతినిధి: రైతులు పండించిన జొన్నలు కొనుగోలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. రామాయంపేట మండల పరిధిలో పండించిన జొన్నలు కొనుగోలు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తో కలిసి మెదక్ కలెక్టరేట్ మంగళవారం ధర్నా నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు కలెక్టర్ వద్ద బైఠాయించారు. సీఎం, ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా రైతులను రోడ్డు పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెబుతూనే మరో వైపు పండించిన పంటను గోనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. రామాయంపేటలో మార్క్ ఫేడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన జొన్నలు తిరిగి పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుంటే ఇంకా కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల జొన్నల విక్రయాల కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి జొన్నలు కొనుగోలు చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని చెప్పారు. ఈ ధర్నాలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్ గౌడ్, సుప్రభాత్ రావు, అహ్మద్, రైతులు, నేతలు పాల్గొన్నారు.

మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే

రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఫోన్‌లో మాట్లాడారు. రైతులు పండించిన జొన్నలు పూర్తిగా కొనుగోలు చేయాలని కోరారు. అధికారులతో మాట్లాడి కొనుగోలు చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. కానీ మంత్రి చెప్పిన స్థానిక మార్క్ ఫేడ్ అధికారులు కొనుగోలు చేయడం తో జాప్యం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.

Next Story