- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ సర్పంచ్ దారుణ హత్య..!
మాజీ సర్పంచ్ పిట్టల యాకయ్య దారుణ హత్యకు గురైన ఘటన మహబూబాబాద్ జిల్లా మండలం సింగారం గ్రామంలో జరిగింది.

దిశ, మహాబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా మండలం సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ పిట్టల యాకయ్య (57) దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాకయ్య మంగళవారం రాత్రి తన ఇంటి ముందు వరండాలో నిద్రిస్తుండగా, గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు ఆయన రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ హత్యకు వ్యక్తిగత విభేదాలా, పాత కక్షలా, లేక మరేదైనా కారణమా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మాజీ సర్పంచ్ హాత్యతో సింగారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






