- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మైనర్‌పై అత్యాచారం..
తనకు వివాహం జరగలేదని,పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది.

దిశ, కరీంనగర్ రూరల్: తనకు వివాహం జరగలేదని,పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు మంగళవారం పోక్సో కేసు నమోదు చేశారు. కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి పోలీసుల కథనం ప్రకారం... పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగ్దుంపూర్ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక కాలేజీకి వెళ్తున్న క్రమంలో మానకొండూరు మండలం జగ్గయ్యపల్లికి చెందిన ఆటో డ్రైవర్ గనుకుంట్ల మురళీ కృష్ణతో పరిచయం ఏర్పడింది.
నిందితునిపై పోక్సో కేసు నమోదు...
నిందితుడు పలుమార్లు జగ్గయ్యపల్లిలోని అతని ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. అయితే మురళీ కృష్ణకు అప్పటికే వివాహం అయిన విషయం బాధితురాలికి ఆలస్యంగా తెలియడంతో అతన్ని కలవడం మానేసింది. దీంతో అతను పలు మార్లు ఫోన్ చేసినప్పుడు బాధితురాలు మాట్లాడినప్పటికీ అతన్ని కలిసేందుకు నిరాకరించింది. బాధితురాలు జూన్ 29వ తేదీన టీసీ కోసం మల్యాల వెళ్లేందుకు ముగ్దుంపూర్ స్టేజీ వద్ద బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో అక్కడకు బైక్‌పై వచ్చిన మురళీ కృష్ణ బాధితురాలిని బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని పెద్దపల్లి జిల్లా నిరుకుల్లా గ్రామంలోని సమ్మక్క సారలక్క ఆలయం వద్దకు తీసుకెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారానికి పాల్పడినట్టు సీఐ తెలిపారు. బాధితురాలి ఫిర్యదు మేరకు నిందితునిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు.






