నా చిరకాల కోరిక నెరవేరుతుంది.. ఇందులో నాలోని భిన్నమైన కోణాలు చూస్తారు: ప్రీతి ముకుందన్

by Mallepaka Hamsa |

తన కెరీర్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'ఆసకూడా' మ్యూజిక్ వీడియో పాట విడుదలయ్యాక తాను సంతకం చేసిన మొదటి సినిమా ఇదేనని వెల్లడించారు.

నా చిరకాల కోరిక నెరవేరుతుంది.. ఇందులో నాలోని భిన్నమైన కోణాలు చూస్తారు: ప్రీతి ముకుందన్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ భారీ క్రేజ్ రాబట్టుకున్నారు. ఆమె చేసిన రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద వరుసగా ఫ్లాప్ అయినప్పటికీ అమ్మడు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తనదైన లుక్స్, యాక్టింగ్ స్కిల్స్‌తో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘బ్లాస్ట్’ మూవీ సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు, అందులో ప్రీతి చేసిన యాక్షన్ సీన్స్ అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచాయి. ప్రస్తుతం అదే జోష్‌లో ఉన్న ఈ భామ, కోలీవుడ్ హీరో అథర్వ మురళి నటిస్తున్న ‘ఇదాయం మురళి’ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించారు. కాయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆకాష్ బాస్కరన్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ప్రీతి ముకుందన్, సినిమా విశేషాలతో పాటు తన కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన కెరీర్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'ఆసకూడా' మ్యూజిక్ వీడియో పాట విడుదలయ్యాక తాను సంతకం చేసిన మొదటి సినిమా ఇదేనని వెల్లడించారు. ‘ఆసకూడా’ సాంగ్ పెద్ద విజయం సాధించి తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని, ఆ తర్వాతే ఈ ప్రాజెక్ట్ తన దగ్గరకు వచ్చిందని ఆమె చెప్పారు. తనకు మొదటి నుండి ఒక మంచి రొమాంటిక్ కామెడీ సినిమా చేయాలనేది చిరకాల కోరికగా ఉండేదని అది ‘ఇదాయం మురళి’ తీరబోతోందని ప్రీతి ముకుందన్ పేర్కొన్నారు. ఈ సినిమా కథ విన్నప్పుడు పక్కా రొమాంటిక్ కామెడీ జోనర్‌లో సాగుతూ తన మనసుకు బాగా నచ్చిందని, అందుకే వెంటనే ఈ పాత్రను ఎంచుకున్నానని ఆమె వివరించారు. ఈ చిత్రంలో తన పాత్రలో రెండు పూర్తి భిన్నమైన కోణాలు కనిపిస్తాయని ప్రీతి ముకుందన్ స్పష్టం చేశారు. కథ విషయానికి వస్తే, ఇందులో కేవలం యువతరం పాత్రలు మాత్రమే కాకుండా, పెద్దవారి పాత్రలు కూడా ఎంతో ప్రాధాన్యతతో ఉంటాయని ఆమె చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుందని ప్రీతి స్పష్టం చేశారు.

Next Story