- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాహనదారులకు గుడ్ న్యూస్.. లీటర్ పెట్రోల్ పై 5 రూపాయల తగ్గింపు
నయారా ఎనర్జీ బంకుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు.. ప్రభుత్వ బంకుల్లోనూ రేట్లు తగ్గించాలని వాహనదారుల డిమాండ్!

దిశ, వెబ్ డెస్క్: దక్షిణాసియాలో నెలకొన్న ఇంధన సంక్షోభం వేళ.. భారీగా పెట్రోల్ రేట్లను పెంచిన నయారా ఎనర్జీ (Nayara Energy) సంస్థ తమ కష్టమర్లకు శుభావార్తను అందించింది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ సంస్థ వాహనదారులకు భారీ ఊరటనిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు గణనీయంగా తగ్గడంతో దేశవ్యాప్తంగా తమ బంకుల్లో ఇంధన ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా లీటర్ పెట్రోల్‌పై రూ. 5, అలాగే లీటర్ డీజిల్‌పై రూ. 3 చొప్పున తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 7,000 కంటే ఎక్కువ పెట్రోల్ పంపుల నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న నయారా ఎనర్జీ తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది.
ఒకవైపు ప్రైవేట్ రంగ చమురు సంస్థ నయారా రేట్లను తగ్గించినప్పటికీ.. దేశంలో మెజారిటీ మార్కెట్ వాటా కలిగిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు మాత్రం ధరలను యథాతథంగా ఉంచాయి. ప్రైవేట్ బంకుల్లో ఇంధనం చౌకగా లభిస్తుండటంతో, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తక్షణమే స్పందించి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని దేశవ్యాప్తంగా వాహనదారులు, రవాణా రంగ ప్రతినిధులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు కూడా ధరలు తగ్గిస్తే సామాన్యులకు మరింత మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






