- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి ప్రైవేట్ ప్లాట్లను కబ్జా చేయడం మానుకోవాలి..
తెలంగాణ జనసమితి నాయకులు బాధిత ప్లాట్ యజమానులతో కలిసి టీజీఐఐసీ జోనల్ మేనేజర్ జ్యోతికి వినతిపత్రం అందజేశారు.

దిశ, ఇబ్రహీంపట్నం: హార్డ్‌వేర్ పార్కు పేరుతో ప్రైవేట్ ప్లాట్లను అక్రమంగా కబ్జా చేసే చర్యలను టీజీఐఐసీ (TGIIC) అధికారులు వెంటనే విరమించుకోవాలని తెలంగాణ జనసమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దార సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త రవి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల గ్రామ పరిధిలోని సర్వే నెం.67లో దాదాపు 300 ప్రైవేట్ ప్లాట్లపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి ప్రహరీ గోడ నిర్మించడం, ఇనుప గేట్లు ఏర్పాటు చేయడం తీవ్ర అభ్యంతరకరమని వారు పేర్కొన్నారు. డబ్ల్యూ.పి. No.27809/2018 కేసులో తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను గౌరవించకుండా అధికారులు వ్యవహరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఇది న్యాయవ్యవస్థ పట్ల అవమానకర చర్యగా భావిస్తున్నామని తెలిపారు.
బలవంతపు ఆక్రమణలకు పాల్పడటం సరికాదు..
ఈ నేపథ్యంలో తెలంగాణ జనసమితి నాయకులు బాధిత ప్లాట్ యజమానులతో కలిసి టీజీఐఐసీ జోనల్ మేనేజర్ జ్యోతికి వినతిపత్రం సమర్పించారు. హైకోర్టు ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని, సర్వే నెం.67లో జరుగుతున్న ప్రహరీ గోడ నిర్మాణం, గేట్ల ఏర్పాటు వంటి పనులను వెంటనే నిలిపివేయాలని, రెవెన్యూ రికార్డుల్లో అసలు ప్లాట్ యజమానుల హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. జీవితకాల పొదుపుతో ప్లాట్లు కొనుగోలు చేసిన చిన్న, మధ్యతరగతి కుటుంబాల హక్కులను కాలరాస్తూ బలవంతపు ఆక్రమణలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని హైకోర్టు ఆదేశాలను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధిత ప్లాట్ యజమానులతో కలిసి తెలంగాణ జనసమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో చట్టబద్ధమైన ప్రజా ఉద్యమాన్ని చేపట్టి, న్యాయం కోసం అన్ని ప్రజాస్వామ్య మార్గాల్లో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్లాట్ల యజమానులు జి. భాస్కర్, ఆర్కే నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.






