- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ, రాజ్యాంగ సవరణ బిల్లులపై జేపీసీ కీలక సమావేశం
నేడు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ, 130వ రాజ్యాంగ సవరణ బిల్లులపై జేపీసీ సమావేశం.. ఏపీ ప్రభుత్వం, సీపీఐ ప్రతినిధుల నుంచి సాక్ష్యాల సేకరణ!

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంటరీ జాయింట్ కమిటీ (JPC) అత్యంత కీలకమైన మూడు బిల్లులపై చర్చించేందుకు జులై 1వ తేదీ రాత్రి 10:30 గంటలకు పార్లమెంట్ హౌస్ Annex (PHA) లో సమావేశం కానుంది. బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీ.. 'రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు-2025', 'జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2025', 'కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ) బిల్లు-2025' లపై సమగ్రంగా సమీక్షించనుంది.
ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా సదరు బిల్లులపై వివిధ వర్గాల నుంచి నివేదికలు, మౌఖిక సాక్ష్యాలను (Oral Evidence) సేకరించనున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు, హైదరాబాద్‌కు చెందిన 'ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్' ప్రతినిధులు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) ప్రతినిధులు కమిటీ ముందు హాజరై తమ అభిప్రాయాలను, బ్రీఫింగ్‌ను అందించనున్నారు. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ, కేంద్రపాలిత ప్రాంతాల పాలనా సంస్కరణలకు సంబంధించిన బిల్లులు కావడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.






