- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తకు ఉరేసి చంపిన భార్య
భార్య అక్రమసంబంధానికి మరో భర్త బలయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో చోటు చేసుకుంది. భర్తకు ఉరివేసి ఆపై గుండెపోటుతో మరణించాడని నిందితులు నమ్మించే ప్రయత్నం చేశారు.

దిశ, వెడ్ డెస్క్: భార్య అక్రమసంబంధానికి మరో భర్త బలయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో చోటు చేసుకుంది. భర్తకు ఉరివేసి ఆపై గుండెపోటుతో మరణించాడని నిందితులు నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే మెడపై గాయాలు కనిపించడంతో గ్రామస్థులు పోలసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యను, ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఇలాంటి దారుణాలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే.
ఒకప్పుడు భర్తలో చేతిలో భార్య హత్య అనే వార్తలు తరచూ వినిపించేవి. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా భార్య చేతిలో భర్త హత్య అనే వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాలే భర్తల హత్యలకు ప్రధాన కారణం అవుతున్నాయి. తమ రిలేషన్ కు అడ్డుగా ఉన్నాడనో లేదంటే ప్రియుడితో కలిసి ఉండేదుకో భార్యలు భర్తలను హతమారుస్తున్నారు. కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.






