డేంజర్‌లో కృతి శెట్టి సినీ కెరీర్.. అదృష్టం కలిసిరాకుంటే ఇండస్ట్రీకి దూరంకాక తప్పదా?

by Mallepaka Hamsa |

‘ఉప్పెన' చిత్రంతో టాలీవుడ్‌లో సెన్సేషనల్ బ్యూటీగా మారిన కృతి శెట్టి(Krithi Shetty), ప్రస్తుతం తన కెరీర్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది.

డేంజర్‌లో కృతి శెట్టి సినీ కెరీర్.. అదృష్టం కలిసిరాకుంటే ఇండస్ట్రీకి దూరంకాక తప్పదా?
X

దిశ, సినిమా: ‘ఉప్పెన' చిత్రంతో టాలీవుడ్‌లో సెన్సేషనల్ బ్యూటీగా మారిన కృతి శెట్టి(Krithi Shetty), ప్రస్తుతం తన కెరీర్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వరుస విజయాలు అందుకున్నప్పటికీ, ఆ తర్వాత నటించిన చిత్రాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్‌కు చెక్కేసింది. అయితే అక్కడ కూడా ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రావడం లేదు. ఇటీవల విడుదలైన 'వా వాతియార్' చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకోవడం కృతి శెట్టిని ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో కృతి శెట్టి ఆశలన్నీ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (Love Insurance Company)(LIk) చిత్రంపైనే ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)హీరోగా నటిస్తుండగా, ఎస్.జె. సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు.

గత ఏడాది విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 12న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే​కృతి శెట్టి ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఈ సినిమా హిట్ అవ్వడం అత్యంత కీలకంగా మారింది. ఒకవేళ ఈ చిత్రం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోతే, తమిళంతో పాటు తెలుగులోనూ ఆమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజన్లు కృతి కెరీర్ ప్రమాదంలో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ బేబమ్మకు మళ్లీ క్రేజ్‌ను తెచ్చిపెడుతుందా? లేక ఇండస్ట్రీకే దూరం చేస్తుందా? అనేది అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే పలు సార్లు వాయిదా పడిన ‘వా వాతియార్’ ఆశించినంత స్థాయిలో ఆడలేదు.. ఇక ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ కూడా అలా కాకుండా కృతి అదృష్టం వల్ల హిట్ అందుకుంటే.. అమ్మడు క్రేజ్ పూర్తిగా మారిపోనుంది.

Next Story