ప్లీజ్ మీరు పెళ్లి చేసుకోండి.. నటి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో యంగ్ హీరో

by Disha Web Desk 7 |
ప్లీజ్ మీరు పెళ్లి చేసుకోండి.. నటి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో యంగ్ హీరో
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కృతి‌ సనన్ తన 32వ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ క్రమంలో తన కెరీర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ గురించిన ఎన్నో స్వీట్ మెమోరిస్ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసి మురిసిపోతుంది. ఇదిలావుంటే కృతి బర్త్ డేను పురష్కరించుకుని స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్.. అర్థరాత్రి తనతో కేక్ కట్ చేయించి తినిపిస్తున్న ఫొటోను నెట్టింట షేర్ చేశాడు. అయితే కృతి డైట్‌లో ఉన్నందున తను పెట్టిన ముక్కలను తినలేదన్న హీరో.. 'అమ్మాయి డైట్ బ్రేక్ చేయలేదు. నాతోపాటు పోజులిచ్చింది. మీ యువరాణి. హ్యాపీ బర్త్ డే పరమ్ సుందరి ఫ్రమ్ యువర్ షెహజాదా' అంటూ రాసుకొచ్చాడు. ఇక ప్రత్యేకంగా విష్ చేసిన హీరోతోపాటు అభిమానులకు ధన్యవాదాలు చెప్పిన నటికి తన ఫ్యాన్స్ ఊహించని షాక్ ఇచ్చారు. 'రీల్‌ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో మీ ఇద్దరిని కలిసి చూడాలని ఉంది. దయచేసి పెళ్లి చేసుకోండి' అని కామెంట్ చేస్తున్నారు. ఇక 'అల వైకుంఠపురంలో' హిందీ రీమేక్ 'షెహజాదా'లో వీరిద్దరు కలిసి నటిస్తుండగా.. ఫిబ్రవరి 2023లో థియేటర్లలోకి రానుంది.



Next Story

Most Viewed