- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్థిక పతనం దిశగా దేశం.. ప్రజల పై ధరాభారం
భారతదేశం మోడీ పాలనలో ఆర్థిక పతనం దిశగా పయనిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.

దిశ, ఖమ్మంటౌన్ : భారతదేశం మోడీ పాలనలో ఆర్థిక పతనం దిశగా పయనిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. మోడీ విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయని భవిష్యత్తులో మరిన్ని ఆందోళనలు -తప్పవని ఆయన హెచ్చరించారు. ఖమ్మంలో భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఆధ్వర్యంలో ధరల పెరుగుదలను నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. వందలాది మంది సీపీఐ కార్యకర్తలు ధరల -తగ్గింపు నిరసన ఆందోళనలో పాల్గొన్నారు. వి. వెంకటాయపాలెం స్టేజీ వద్ద నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్లోకి చొచ్చుకుపోయేందుకు సిపిఐ శ్రేణులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య -తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఆందోళనకారులను ఉద్దేశించి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ల కోసం పాలన సాగుతుందని మోడీది కార్పొరేట్ల పాలన అని ఆయన స్పష్టం చేశారు.
సహజంగా సంపన్నులు, వ్యాపారుల పై పన్నులు విధించి పేదలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తాయని కానీ మోడీ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా పేదలపై భారాలు మోపుతూ సంపన్నులు, కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ప్రకటిస్తున్నారని కూనంనేని తెలిపారు. ప్రజల పై ధర భారం మోపుతున్న ఈ మోడీకి వ్యతిరేకంగా యావత్ ప్రజానీకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మన్మోహన్ సింగ్ హయాంలో డాలర్ -ధర రూ. 56 ఉంటే అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ రూపాయి పతనంపై ఆరోపణలు చేస్తూ రాజీనామాకు డిమాండ్ చేశారని మరి ఇప్పుడు చరిత్రలో ఎన్నడులేనివిధంగా ఒక డాలర్కు రూ.96.50లు చెల్లించే పరిస్థితి దాపురించిందని దీనికి మోడీ ఏమి సమాధానం చెబుతారని కూనంనేని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపునకు పైగా పెరిగాయని, గ్యాస్ బండ ఈ ఏడాదిలోనే మూడు సార్లు పెరిగిందని ఆయన తెలిపారు. ధరలను నియంత్రించ లేని మోడీ పరిపాలనకు అనర్హుడని కూనంనేని తెలిపారు.
మోడీ ఇచ్చిన ఏ వాగ్దానాన్ని 12 ఏళ్ల కాలంలో అమలు చేయలేదని నల్ల ధనం తీసుకు రాలేదని, కోట్ల ఉద్యోగాలను కల్పించ లేదని ఆయన -తెలిపారు. ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకు రావడంలో మాత్రం మోడీ ముందు వరుసలో నిలిచారని కూనంనేని ఆరోపించారు. దేశంలో -సంపద పొగుపడుతుందని దేశ ప్రజలు పేదలు, సంపన్నులు అనే రెండు వర్గాలుగా విడిపోయారని తెలిపారు. ఎరువుల ధరలు పైపైకి పోతున్నాయి. రాష్ట్రంలో కూడా పెట్రో ధరలను నియంత్రించే అవకాశం ఉన్న అదే ఆదాయ వనరుగా భావించి ధరలను నియంత్రించ లేదని కూనంనేని తెలిపారు. ఇద్దరు పాలనపై పట్టు కోల్పోయారు.
రెండున్నర ఏళ్ల కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. పింఛన్ల పెంపు, పూర్తి స్థాయిలో రైతు భరోసా జరగలేదని రైతు భరోసా విషయంలో రకరకాల కారణాలతో ఎగవేతలు జరుగుతున్నాయని కూనంనేని -తెలిపారు. మహిళలకు ఇచ్చిన హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించిందన్నారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం రెండున్నర ఏళ్ల పాటు వేచి చూశామని ప్రభుత్వం సరైన రీతిలో స్పందించక పోవడంతో ఆందోళన బాట పట్టామని కూనంనేని తెలిపారు. ముఖ్యంగా ఫీజు రీయంబర్స్మెంట్ విషయమై విద్యార్థుల పక్షాన, ఉద్యోగ, ఉపాధి కల్పన కై యువజనుల పక్షాన, ఎరువుల ధరలు -తగ్గించాలని, పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని, పంట బీమా పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని కూనంనేని డిమాండ్ చేశారు. -అధికారంలో ఉన్నాం ఏమి చేసినా సరిపోతుందని ప్రజలను విస్మరిస్తే తగు ప్రతిఫలం అనుభవించక తప్పదని ఆయన హెచ్చరించారు.
హామీలు నెరవేరే వరకు నిరంతర ఆందోళనలు..
హామీలు నెరవేరే వరకు నిరంతర ఆందోళనలు తప్పవని సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తెలిపారు. హామీల అమలు కోసం రెండున్నర ఏళ్ల పాటు ఎదురు చూశామని రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీల అమలుపై దృష్టి సారించడం లేదన్నారు. రాష్ట్రంలోని అప్పులను ఎరగా చూపుతూ -పథకాల అమలును వాయిదా వేస్తుందని ఆయన తెలిపారు. పెట్రో ధరల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్యాస్ బండ పై మూడు సార్లు ధరలు పెంచారని పెట్రోల్, డీజిల్ ధర నిరంతరం పెరుగుతూనే ఉందని ఆయన తెలిపారు. ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. మోడీ కార్పొరేట్ల గుప్పెట్లో బంధీగా మారి ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపించారు. -ధరల పెరుగుదలను నియంత్రించక పోతే సమరశీల పోరాటాలకు శ్రీకారం చుడతామని సురేష్ హెచ్చరించారు.
ఈ ఆందోళనను ఉద్దేశించి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి తదితరులు మాట్లాడగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు యర్రా బాబు, ఎస్కె జానిమియా, -ఏపూరి లతాదేవి, సిద్దినేని కర్ణకుమార్, బిజి క్లెమెంట్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు, పోటు కళావతి, కర్నాటి -భానుప్రసాద్, తాటి వెంకటేశ్వరరావు, ఏపూరి రవీంద్రబాబు, పుచ్చకాయల కమలాకర్, దొండపాటి రమేష్, తోట రామాంజనేయులు, పగడాలా -మల్లేష్, దండు ఆదినారాయణ, మేకల శ్రీనివాసరావు, ఏనుగు గాంధీ, పావులూరి మల్లికార్జున్, కూచిపూడి రవి, యంగల ఆనందరావు, -యానాలి సాంబశివరెడ్డి, ప్రజా సంఘాల బాధ్యులు బత్తినేని నీరజ, నానబాల రామకృష్ణ, మడుపల్లి లక్ష్మణ్, ఇటికాల రామకృష్ణ, -రఘునాథపాలెం మండల కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆందోళన అనంతరం డిమాండ్స్ కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ కి అందజేశారు.






