- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాద్‌నగర్‌లో కాంగ్రెస్‌కు షాక్.. పార్టీకి కీలక నేతలు గుడ్ బై..!
దిశ, ఫరూక్ నగర్: షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్‌లో మరోసారి గ్రూప్ రాజకీయాలు- latest Telugu news

దిశ, ఫరూక్ నగర్: షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్‌లో మరోసారి గ్రూప్ రాజకీయాలు బయటపడ్డాయి. ఇప్పటికే మూడు గ్రూపులతో సతమతమవుతున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ.. రోజురోజుకు బయట పడుతున్న విభేదాలతో గందరగోళం ఏర్పడింది. తాజాగా ఓ ఎంపీటీసీ రాజీనామా చేస్తానని ప్రకటించడం కలకలం రేపింది. 'కాంగ్రెస్ పార్టీలో అడుగడుగునా అవమానాలకు గురి చేశారు. మనోభావాలను కించ పరిచారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక పోతున్నామని'.. షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం కొండన్నగూడ గ్రామానికి చెందిన ఎంపీటీసీ పాత్లావత్ లక్ష్మీబాయి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని వాట్సాప్ ద్వారా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డికి పంపిస్తున్నట్టు పేర్కొన్నారు.
అంతే కాకుండా ఎంపీటీసీ కుమారుడు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు రవీందర్ నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆమె వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని.. తమకు వేధింపులు తప్పడం లేదని ఆరోపించారు. పార్టీలో నియోజక వర్గ స్థాయి నాయకులు తమను టార్గెట్ చేశారని ఆరోపించారు. నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తమపై కక్ష్య కట్టారని.. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ భవిష్యత్ రాజకీయ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.






