- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుజరాత్‌కు బ్రేక్.. కోల్‌కతా సూపర్ విక్టరీ
వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ షాక్ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న గుజరాత్ టైటాన్స్(GT)కు కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) షాక్ ఇచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో శుభ్‌మన్ గిల్ సేనపై కేకేఆర్ జట్టు 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 247 పరుగులు చేసింది. అలెన్(93), రఘువంశీ(82), గ్రీన్(52) పరుగులతో అదరగొట్టారు. 248 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. గుజరాత్ జట్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (85), జోస్ బట్లర్ (57), సాయి సుదర్శన్ (53*) పరుగులు చేసినా వీరి పోరాటం వృథా అయింది. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు పడగొట్టగా, సౌరభ్ దూబే, కామెరూన్ గ్రీన్ చెరో వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.






