- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్.. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ కైవసం
కరీంనగర్ మేయర్‌గా బీజేపీ నేత కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు ఎన్నిక. కార్పొరేషన్‌పై రెపరెపలాడిన కాషాయ జెండా!

దిశ, వెబ్ డెస్క్: గత నాలుగు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెర దించుతూ కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 66 స్థానాలకు గాను 30 కార్పోరేటర్లను గెలుచుకున్న బీజేపీ మొదటి నుంచి మేయర్ రేసులో కొనసాగింది. మధ్యలో మంత్రి పొన్నం ప్రభాకర్ తాము కూడా రేసులో ఉన్నామంటూ ప్రకటించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే కాంగ్రెస్, ఎంఐఎం, స్వతంత్రులతో కలిపి ఆ పార్టీకీ బలం లేకపోవడంతో బీఆర్ఎస్ మద్దతు అనివార్యం అయింది.
కానీ చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీ మేయర్ ఎన్నికకు దూరంగా ఉంటామని ప్రకటించడంతో బీజేపీ లైన్ క్లియర్ అయింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 69 ఓట్లు ఉండగా.. బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ కు 34 ఓట్ల మద్దతు లభించింది. దీంతో ఆయన కరీంనగర్ మేయర్ అభ్యర్థిగా ఎన్నుకోబడ్డారు. అలాగే డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు గెలిచారు. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆశయం నెరవేరి.. కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా రెపరెపలాడింది.






