Kodali Nani: నాకేం కొమ్ములు లేవు.. కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

by Satheesh |   (  Updated:2022-04-08 05:43:36  IST  )

దిశ, వెబ్‌డెస్క్: ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్‌లోని 24- Latest Telugu News

Kodali Nani: నాకేం కొమ్ములు లేవు.. కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా తమ రాజీనామా లేఖలను గురువారం సీఎం జగన్‌కు అందజేశారు. కుల సమీకరణలు, సామాజిక సమీకరణాలు, అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని కొంత మందిని మంత్రివర్గంలో కొనసాగిస్తానని సీఎం జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కొడాలి నానికి కొత్త మంత్రివర్గంలో స్థానముంటుందా? అనే ప్రశ్నను లేవనెత్తారు. తాజాగా.. దీనిపై స్పందించిన కొడాలి నాని.. ''కొడాలి నానికి నాలుగు కొమ్ములేమీ లేవు. కొత్త కేబినెట్‌లో నాకు స్థానం దక్కకపోవచ్చు'' అని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని నాని స్పష్టం చేశారు. సీఎం నిర్ణయానికి ప్రతి ఒక్కరం కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Next Story