- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌతాఫ్రికా జట్టులోకి తిరిగి వెల్లనని తేల్చేసిన క్లాసెన్.. హైదరాబాద్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్!
అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనని స్పష్టం చేసిన ఎస్ఆర్హెచ్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్! ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు వైరల్.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో మిడిల్ ఆర్డర్ గా వస్తూ.. సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచులో జట్టుకు కావాల్సి విజయాలను అందిస్తూ.. కీలకంగా మారుతున్నాడు. గత రెండు సీజన్లుగా మంచి ఫామ్ కనబరుస్తున్న క్లాసెన్ తిరిగి సౌతాఫ్రికా జట్టులోకి వెళ్తాడని అనే వార్తలు వస్తున్నాయి. అలాంటి వార్తలపై సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కీలక ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి వెళ్లనని, తన పూర్తి దృష్టి ఇప్పుడు 'యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్' (ETPL) పైనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్ 2026లో క్లాసెన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో, ఆయన మళ్లీ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. అయితే, క్లాసెన్ మాత్రం తాను రోటర్‌డామ్ ఫ్రాంచైజీతో భాగస్వామ్యం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, ఈ లీగ్‌లో ఆయన ఆ జట్టుకు కో-ఓనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు.
కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో ఎంజాయ్
మరోవైపు, ఐపీఎల్ మ్యాచ్‌ల మధ్య దొరికిన విరామ సమయంలో క్లాసెన్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ నగరంలో సరదాగా గడుపుతున్నారు. నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ, స్థానిక వంటకాలను రుచి చూస్తూ ఆయన కెమెరా కంటికి చిక్కారు. క్లాసెన్ తన భార్య, చిన్నారితో కలిసి హైదరాబాద్ వీధుల్లో తిరుగుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సన్‌రైజర్స్ అభిమానులు తమ అభిమాన ఆటగాడు మైదానంలోనే కాకుండా, బయట కూడా నగర సంస్కృతిని ఆస్వాదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.






