జోరుగా కైట్ ఫెస్టివల్

by Muthe.Rajitha |

పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జోరుగా సాగుతోంది.

జోరుగా కైట్ ఫెస్టివల్
X

దిశ, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ లో సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జోరుగా సాగుతోంది. జనవరి 13 నుంచి 15 వరకు జరుగుతున్న ఈ ఫెస్టివల్‌ను తెలంగాణ పర్యాటక శాఖ, ప్రైవేట్ స్పాన్సర్లు కలిసి నిర్వహిస్తున్నారు. 19 దేశాల నుంచి వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత పతంగుల కళాకారులు రంగురంగుల, భారీ పతంగులను ఎగురవేస్తూ సందర్శకులను ఆకట్టుకుంటున్నారు. భారత్‌తో పాటు చైనా, జపాన్, థాయ్‌లాండ్, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా వంటి దేశాల నుంచి వచ్చిన డ్రాగన్, ఈగిల్, బటర్‌ఫ్లై, ఫిష్ ఆకృతుల పతంగులు, 50 నుంచి 100 అడుగుల పొడవైన పతంగులు, LED లైట్స్‌తో నైట్ కైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

అదే సమయంలో సంక్రాంతి స్వీట్ ఫెస్టివల్‌లో రేగిపిండి లడ్డులు, సున్నుండలు, బెల్లం మిఠాయిలు, అరటి చిప్స్ వంటి సంప్రదాయ తీపి వంటకాలు లభిస్తున్నాయి. ఫుడ్ ఫెస్టివల్, కిడ్స్ జోన్, ఫోటోగ్రఫీ జోన్, రాత్రివేళ లైట్ అండ్ సౌండ్ షో, ఫైర్ డాన్స్ వంటి కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. కాగా కైట్ ఫెస్టివల్ కు నగర ప్రజలు తండోపతండాలుగా వస్తుండటంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారు.

Next Story