- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాను చనిపోతూ నలుగురికి ఊపిరి నింపిన కిరణ్
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడు మరణానంతరం తన అవయవాలను దానం చేసి నలుగురి జీవితాల్లో వెలుగు నింపాడు.

దిశ, మాగనూరు/మక్తల్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడు మరణానంతరం తన అవయవాలను దానం చేసి నలుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. మాగనూరు మండలం ఆలంపల్లి గ్రామానికి చెందిన కోనేటి కిరణ్ కుమార్ (24) అంతిమయాత్ర మంగళవారం గ్రామంలో విషాద వాతావరణంలో జరిగింది. చిన్నా, పెద్దా, యువత, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆలంపల్లి గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ ఎంఏ చదువుతూ హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి అతడు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ, కిరణ్ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో వైద్యులు గుండె, కిడ్నీలు, కాలేయాన్ని సేకరించి నలుగురు రోగులకు అమర్చారు. మరణానంతరం కూడా నలుగురికి ప్రాణదాతగా నిలిచిన కిరణ్ సేవలను గ్రామస్తులు కొనియాడారు. మంగళవారం గ్రామంలో నిర్వహించిన అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై కిరణ్‌కు కన్నీటి నివాళులు అర్పించారు.






