కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ విడుదల తేదీ ఫిక్స్.. స్టన్నింగ్ లుక్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2024-10-14 14:34:38  IST  )

టాలీవుడ్ యంగ్ కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క’.

కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ విడుదల తేదీ ఫిక్స్.. స్టన్నింగ్ లుక్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క’. పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సందీప్, సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణా రెడ్డి (Chinta Gopalakrishna Reddy)ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నయన్ సారిక(Nayan Sarika), తన్వి రామ్ (Tanvi Ram)హీరోయిన్లుగా కనిపించనున్నారు. ‘క’ మలయాళ థియేట్రికల్ రైట్స్‌ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)వేఫేరర్ ఫిలింస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం అక్టోబర్ 31న వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు వెల్లడించాడు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. ప్రజెంట్ కిరణ్ అబ్బవరం స్టన్నింగ్ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story