Kiran Abbavaram: థియేటర్‌లో ‘క’ టికెట్స్ అమ్ముతోన్న కిరణ్ అబ్బవరం.. వీడియో వైరల్

by Kodari Anjali |   (  Updated:2024-11-03 10:25:49  IST  )

సందీప్-సుజీత్ తెరకెక్కించిన ‘క’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

Kiran Abbavaram: థియేటర్‌లో ‘క’ టికెట్స్ అమ్ముతోన్న కిరణ్ అబ్బవరం.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: సందీప్(Sandeep)-సుజీత్(Sujeet) తెరకెక్కించిన ‘క’ సినిమా(Ka movie) బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి ప్రేక్షకుల స్పందన భారీగా లభిస్తోంది. ఇందులో నయన్ సారిక(Nayan Sarika), తన్వీ రామ్ (Tanvi Ram) కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచేశారు. క సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో కిరణ్ అబ్బవరం ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. అయితే ఈ హీరో సినిమా మొదటిసారిగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో తాజాగా ఎఏంబీ సినిమాస్‌(AMB Cinemas)లో క చిత్రం చూడడానికి వచ్చాడు. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం ఆడియన్స్ కు టికెట్స్ అమ్మారు. అంతేకాకుండా టికెట్స్ అమ్ముతూ అభిమానులతో సెల్ఫీలు దిగాడు. అనంతరం థియేటర్ లోపలికి వెళ్లి ఆడియన్స్‌తో కాసేపు ముచ్చటించాడు. చాలా కాలం తర్వాత థియేటర్స్ ఇలా ఫుల్ గా చూడటం చాలా హ్యాపీగా ఉందని కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. కుటుంబ సభ్యులతో వచ్చి మరీ క మూవీ వీక్షిస్తున్నందుకు నిజంగా థ్యాంక్యూ అని తెలియజేశాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ఆడియన్స్ కు టికెట్స్ అమ్ముతోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Read More..

అరేయ్ అబ్బాయిలు పెళ్లి చేసుకోండి.. సక్సెస్ అదే వస్తుంది.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్


Next Story