మూడో ప్రియుడితో హాట్ బ్యూటీ బ్రేకప్.. ఫ్రెండ్‌గా ఉంటానంటూ

by sudharani |
మూడో ప్రియుడితో హాట్ బ్యూటీ బ్రేకప్.. ఫ్రెండ్‌గా ఉంటానంటూ
X

దిశ, సినిమా : సోషల్ మీడియా పర్సనాలిటీ కిమ్ కర్దాషియన్ మూడో ప్రియుడికి బ్రేకప్ చెప్పేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ స్టాండప్ కమెడియన్ పీట్ డేవిడ్‌సన్‌తో తొమ్మిది నెలలుగా డేటింగ్ చేస్తున్న ఆమె తాజాగా విడిపోయినట్లు హాలీవుడ్ మీడియా వెల్లడించింది. 2021 అక్టోబర్‌లో ఒకరికొకరు పరిచయమైన కొంతకాలానికే ప్రేమలోపడ్డ ఈ స్టార్స్.. ఈ ఏడాది మెట్ గాలా ఈవెంట్‌లో రెడ్ కార్పెట్‌పై నడిచి తాము డేటింగ్‌లో ఉన్నట్లు బహిరంగంగా ప్రకటించారు. అయితే మనస్పర్థల కారణంగా ఈ మధ్య దూరంగా ఉంటున్నారని, తమ డేటింగ్ ఇష్యూ గురించి మాట్లాడేందుకు ఇష్టపడట్లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ భవిష్యత్‌లో స్నేహితులుగా కొనసాగాలని ఇరువురు నిర్ణయించుకున్నట్లు డేవిస్ క్లోజ్ ఫ్రెండ్ మీడియాకు చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇప్పటికే రెండుసార్లు పెళ్లిచేసుకున్న కర్దాషియన్‌కు నలుగురు పిల్లలున్నారు.



Next Story