ఖరీఫ్ కలవరం.. కనిపించని వరుణుడి జాడ!

by Jakkula.Mamatha |

వానాకాలం సీజన్ ప్రారంభమై 15 రోజులు కావస్తున్నా వరుణుడు కరుణించడం లేదు.

ఖరీఫ్ కలవరం.. కనిపించని వరుణుడి జాడ!
X

దిశ, ఆసిఫాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభమై 15 రోజులు కావస్తున్నా వరుణుడు కరుణించడం లేదు. పంట సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలకు వరుణుడు ఊరిస్తుండటంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. దీంతో రైతుల్లో ఖరీఫ్ కలవరం మొదలైంది. సాధారణంగా జూన్ మొదటి వారానికి నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి వర్షాలు కురుస్తాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది ఇంకా వర్షాలు ప్రారంభం కాలేదు. జిల్లాలో ప్రతి ఏటా సుమారు 3.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. అయితే సీజన్ ప్రారంభంలో కురిసిన కొద్ది కొద్దిపాటి వానలు పడగానే గంపెడు ఆశలతో జిల్లాలో సుమారు 30 శాతం రైతులు ముందస్తుగా పత్తి విత్తనాలు వేశారు. మరికొందరు రైతులు వర్షాలు లేక పొలాల్లో దుక్కులు దున్నుకుంటున్నారు. అయితే మొదట వేసిన విత్తనాలు నీరులేక మొలకెత్తలేదు. పెట్టిన పెట్టుబడి రైతులు నష్టపోయారు. ఇక వర్షాల మాట ఏమో కానీ పొద్దంతా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ నమోదు. ఎండ తీవ్రత సైతం ఎక్కువగా ఉండటంతో కర్షకులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎక్కువగా వర్ష ఆధారిత పంటల పైనే జిల్లా రైతులు సాగు చేస్తారు. ప్రస్తుతం వర్షాలు లేక రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది.

ఎల్ నినో ప్రభావం..

ఈసారి ఎల్ నినో ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో వర్షాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు అని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు తాజాగా అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఇదే అంశాన్ని ప్రకటించింది. మరోవైపు ప్రాజెక్టులలో తగినంత నీరు నిల్వ లేకపోవడం వర్షాలు ఆలస్యం కావడం కారణంగా ఆందోళన పెంచుతున్న.. ప్రస్తుతం సాగు అవసరం పెద్దగా లేకపోయినా జూలై ఆగస్టు నెలలో పరిస్థితి ప్రమాదం లేకపోలేదు.. ఇప్పటికే వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోతే నీటి విడుదలపై ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చని నిప్పులు భావిస్తున్నారు. సాగు అవసరాలతో పాటు తాగునీటి సరఫరా కూడా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారే అవకాశాలు కనిపిస్తుంది.

వరి పత్తికి ప్రత్యామ్నాయంగా..

ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు నీటి వినియోగం అధికంగా ఉండే వరి పత్తి పంటల సాగుకు ప్రత్యామ్నాయంగా పెసలు, కందులు, జొన్న, వేరుశనగ, సోయాబీన్, మినుము, ఆముదం వంటి పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

Next Story