TG20 లీగ్.. ఫైనల్లోకి ఖమ్మం

by Muthe.Rajitha |

టీజీ20 లీగ్‌లో ఖమ్మం ఏసెస్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో హైదరాబాద్ ను ఓడించి, టైటిల్ పోరుకు అర్హత సాధించింది.

TG20 లీగ్.. ఫైనల్లోకి ఖమ్మం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ టీజీ20 లీగ్‌లో ఖమ్మం ఏసెస్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్‌ను 10 పరుగుల తేడాతో ఓడించి, టైటిల్ పోరుకు అర్హత సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం ఏసెస్ నిర్ణీత 200/6 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సాయివికాస్ రెడ్డి కేవలం 27 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. ఆ తర్వాత గడుగు గణేశ్ (27), ప్రణవ్ వర్మ (26), వైష్ణవ్ రెడ్డి (21 నాటౌట్), అన్విత్ రెడ్డి (16), అజయ్‌ దేవ్ గౌడ్ (13) విలువైన పరుగులు జోడించి జట్టు స్కోరును 200 మార్కు దాటించారు.

సహేంద్ర మల్లు బౌలింగ్ మ్యాజిక్

201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. నిర్ణీత 20 ఓవర్లలో 190/8 స్కోరుకే పరిమితమైంది. ఖమ్మం బౌలర్లలో సహేంద్ర మల్లు 3 వికెట్లతో హైదరాబాద్ ను కోలుకోలేని దెబ్బ తీసాడు. అతనికి తోడుగా వేద్‌రెడ్డి 2 వికెట్లు తీయగా.. హర్షిత్‌, విద్యానందరెడ్డి, సీవీ మిలింద్‌ తలో వికెట్‌తో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు. శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2 లో గెలిచిన జట్టుతో ఆదివారం జరిగే మహాసంగ్రామంలో అన్విత ఖమ్మం ఏసెస్ తలపడనుంది.

Next Story