ప్రశ్న రావణ్ ఇంట్లో ఏపీ పోలీసుల సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

by Muthe.Rajitha |

ప్రశ్న రావణ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏపీ పోలీసులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

ప్రశ్న రావణ్ ఇంట్లో ఏపీ పోలీసుల సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
X

దిశ, వెబ్ డెస్క్ : వివాదాస్పద వ్యాఖ్యల ఆరోపణల కేసులో ప్రముఖ యూట్యూబర్ ‘రావణ్’ అలియాస్ జోసెఫ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బుధవారం సాయంత్రం ఏపీ పోలీసులు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆయన నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరేంద్రనగర్‌ కాలనీలో రావణ్ గత రెండేళ్లుగా నివాసముంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన గన్నవరం పోలీసుల ప్రత్యేక బృందం బుధవారం సాయంత్రం ఆయన ఇంటికి చేరుకుంది. రాత్రి పొద్దుపోయే వరకు ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగాయి. రావణ్ భార్య నుంచి కీలక వివరాలు సేకరించి, సంతకాలు తీసుకున్నారు. రావణ్ యూట్యూబ్ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు, డిజిటల్ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ తనిఖీలు జరుగుతున్న సమయంలో స్థానిక విలేకరులను కానీ, ఇరుగుపొరుగు వారిని కానీ ఇంట్లోకి అనుమతించలేదు. తనిఖీల అనంతరం రావణ్ భార్యను .అదుపులోకి తీసుకొని దాదాపు 8 గంటలపాటు విచారించి వదిలేశారని సమాచారం.

Next Story