నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి : ట్రంప్

by I. Sairam |

తాను ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్దాలు ఆపానని, కాబట్టి తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి : ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత్ - పాక్ మధ్య జరిగిన యుద్ధాన్ని తానే ఆపానని మరో సారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. గురువారం బ్రిటన్ పర్యటన నిమిత్తం యూకే వెళ్తూ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో 11 విమనాలు కూలిపోయాయని అన్నారు. ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణ అణు యుద్ధానికి దారితీసే పరిస్థితికి చేరిందని అన్నారు. దీంతో తాను జోక్యం చేసుకున్నానని డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. తాను ఇరు దేశాలపై 200 శాతం టారిఫ్‌లు విధిస్తానని బెదిరించడం వల్లే వారు యుద్ధాన్ని ఆపేశారని తెలిపారు. ఇలా తాను ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలను ఆపానని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని మరో సారి ఆయన డిమాండ్ చేశారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఈ సీజ్ ఫైర్ కేవలం భారత్, పాకిస్తాన్ దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్స్ జనరల్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారానే సాధ్యమైందని తెలిపారు. ఇందులో ఎలాంటి మూడో పక్షం జోక్యం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Next Story